వజ్రోత్సవ సంబరాలలో పాల్గొనడం మనందరి అదృష్టం

       *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 20 ::స్వాతంత్ర భారత వజ్రోస్త్సవాల  లో ప్రతి ఒక్కరు పాల్గొని సంబరాలు జరుపుకోవడం మనందరి అదృష్టమని  మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ లో  ముగ్గుల పోటీలను నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు అజ్రోత్సవాల సందర్భంగా దేశభక్తిని చాటి ముగ్గులు వేసిన ప్రతి ఒక్క మహిళకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు పోటీలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు మనోహరాబాద్ మండల  కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను  పర్యవేక్షించారు  మండల స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు  దేశం మొత్తం    స్వాతంత్ర భారత వజ్రొస్త్సవాల సందర్భంగా దేశంలో  పండుగ వాతావరణం నెలకొన్నదని  మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి ఎంపీడీవో యాదగిరి రెడ్డి  ఏపిఎం  పెంట గౌడ్  సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి శ్రీరామ గ్రామ మహిళ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు