వనపర్తిని విద్యాపర్తి గా మార్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి బ్యూరో అక్టోబర్04 (జనంసాక్షి)

వనపర్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని అంగులతో కూడుకున్న విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారని వనపర్తిని విద్యాపర్తి గా తీర్చిదిద్దిన ఘనత మంత్రి కే తగ్గిందని కొని ఆడారు మెడికల్ కళాశాల ఇంజనీర్ కళాశాల మత్స్య కళాశాల అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుతోపాటు పాలిటెక్నిక్ రాజప్రసాదానికి 22 కోట్లు మంజూరు చేశారని తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్ద బిడ్డ వేస్తూ అన్ని వసతులను కల్పిస్తుంది వీటిని ఉపయోగించుకొని విద్యార్థులు నీలదొక్కుకోవాలని వాకిట శ్రీధర్ పిలుపునిచ్చారు గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ క్రమశిక్షణగా మిలగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ శ్రీనివాసులు కౌన్సిలర్ రహీం అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.