వయోవృద్ధుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :వృద్ధ శ్రమంలో ఉన్న వయో వృద్దులకు పూర్తిగా సహాయ
 సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు . శుక్రవారం పట్టణంలోని కెఆర్కే కాలనిలోని వృద్ధాశ్రమం లో స్వతంత్ర భారత వజోత్సవాల సందర్భంగా జిల్లా మహిళా , శిశు , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి . ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వయోవృద్ధులు శుభాకాంక్షలు తెలిపారు . ఈ నెల 8 నుండి 22 వరకు వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేస్తున్నారని తెలిపారు . వయోవృద్ధుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు . వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరు మానవతా దృక్పదం కలిగి ఉండాలని , శారీరక , మానసిక వేధింపులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . జిల్లాలో పట్టణంలోని కేఆర్కే కాలనీ , తలమడుగు మండలంలోని సాయిలింగి లో వృద్ధాశ్రమాల్లో పండ్లు , బట్టలు , నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఆరోగ్య పరిరక్షణకు ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు . సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు , అధికారులకు సూచించారు . జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ , స్వతంత్ర భారత వజోత్సవాల సందర్భంగా వయోవృద్ధులు శుభాకాంక్షలు తెలిపారు . వయోవృద్దులకు చేయూతనందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని అన్నారు . తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు గౌరవించాలని , వేధింపులకు గురిచేస్తే పోలీస్ శాఖ ద్వారా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు . అనంతరం కలెక్టర్ , ఎస్పీ , అధికారులు వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు . పురపాలక శాఖ అధికారులు , సిబ్బంది కలిసి 14 వేల విలువగల నిత్యావసర సరుకులు , దుప్పట్లను వృద్ధులకు అందించారు . అనంతరం విద్యానగర్ లోని శిశు గృహ కేంద్రం పిల్లలకు కలెక్టర్ , ఎస్పీ పండ్లను పంపిణీ చేశారు . వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ , మున్సిపల్ కమీషనర్ శైలజ , తహసీల్దార్ వనజారెడ్డి , వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవిదాస్ , స్వచ్చంద సంస్థల ప్రతినిధి సురేందర్ , అధికారులు , సిబ్బంది , వయోవృద్ధులు , తదితరులు పాల్గొన్నారు . అంతకుముందు జిల్లా జైలుని సందర్శించి , ఖైదీలకు కల్పిస్తున్న వసతులను జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ను 2 sov జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు . అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ , ఖైదీలకు స్వతంత్ర భారత వజోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు . సత్ప్రవర్తన , క్రమశిక్షణ పాటించి శిక్షా కాలం అనంతరం సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించాలని అన్నారు . ప్రతి ఒక్కరు వ్యక్తి పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలనీ అన్నారు . అత్యవసర వైద్య చికిత్సలను అందించేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు . అనంతరం కలెక్టర్ , రిమ్స్ డైరెక్టర్ ఖైదీలకు పండ్లను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ , మెడికల్ ఆఫీసర్ నైనత జైలర్లు , సబ్ జైలర్లు , ఖైదీలు , తదితరులు పాల్గొన్నారు .