వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్
వరంగల్, మార్చి 2( జనంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్ వేటు పడింది. చాక్లెట్ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న ఓబాలుడిని ఎస్‌ఐ కృష్ణకుమార్ ఘరానా నేరగాళ్లతో కలిపి నిర్భందించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్‌ఐని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై డీజీపీ అనురాగ్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్ రేంజ్ డీఐజీని, డీజీపీ ఆదేశించారు.