వరంగల్‌ జంపఖానాలకు ప్రపంచ ఖ్యాతి

మసకబారుతున్న నేతన్నల జీవితాలు
ఆదుకుంటే తప్ప ముందుకు సాగని వృత్తి
వరంగల్‌,మే26(జ‌నం సాక్షి): జంపాఖానాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్‌. వీటి ఉత్పత్తిలో వరంగల్‌ లోని కొత్తవాడకు మంచి గుర్తింపు ఉంది. కొత్తవాడ నేతన్నల మగ్గాల్లో తయారైన కళాత్మక దర్రీలకు మంచి డిమాండు ఉండేది.దేశ విదేశాల గుర్తింపు పొందాయి ఈ దర్రీలు.చేనేత కార్మీకులు తయారు చేయడంతో వీటి అమ్మకాలు భారాగా ఉండేవి. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు వచ్చిన వరంగల్‌ కొత్తవాడ నేతన్న దర్రీలపై  అందరి దృష్టీ  పడింది.రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల హెల్త్‌ కార్డులను ఎత్తివేసింది.దృష్టిలోపంతో ఉన్న సరైన వైద్యం పొందలేని పరిస్థితి.అరకొర కూలితో నెట్టుకువస్తున్న నేతన్న నుండి 8? త్రెఫ్ట్‌ ఫండ్‌ కింద చేనేత సంఘాల వసూలు చేస్తున్నారు. నేతన్నలు రోజంత కష్టపడి నేసిన కార్మికుడు పొందుతున్న కూలి ఎంత ?.దర్రీలలో రకాలు ఎన్ని ఉన్నాయి ?.ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు ?.నేత కార్మికులు ఎంత లబ్ది పొందుతున్నారు.కొత్తవాడ నేతన్న స్థితిగతులపై ప్రత్యేక కథనం….
వరంగల్‌ లోని కొత్తవాడ ప్రాంతం దర్రీల తయారీకి పెట్టింది పేరు. వరంగల్‌ కొత్తవాడ నేతన్న 1885 బ్రిటిష్‌ పాలన కాలంలో తయారు చేసిన దర్రీ ఇప్పటికి లండన్‌ మ్యూజియంలో భద్రంగా వుంది. నిజాం కాలం లో కూడ ఇక్కడ తయారైన జంపాఖానలకు మంచి అదరణ వుంది. ఇప్పటికి దర్రీల తయారీనే నమ్ముకుని జీవిస్తున్నారు కొత్తవాడ చేనేత కార్మికులు. నాణ్యమైన దర్రీలు తయారీలో కొత్తవాడ నేతన్నలు
మంచి గుర్తింపు పొందారు . గతంలో ఇక్కడ పిట్ట రాములు అనే నేత కార్మికుడు తయారు చేసిన దర్రీకి జాతీయస్థాయిలో అవార్డు సైతం దక్కింది. మారుతున్న కాలానికి అనుగూణంగా వేరైటీ డిజైన్లలో దర్రీల తయారు చేస్తున్నారు మన నేతన్నలు.ఇంటర్‌ లాక్‌ కార్పెట్లు,కళంకారి,జకార్డ్‌,టై అండ్‌ డై,సాధారణ దర్రీలంటూ వెరైటీలనూ తయారు చేస్తున్నారు. వరంగల్‌ కొత్తవాడలో తయారు చేసిన కార్పెట్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వరంగల్‌ నుంచి దర్రీలు కెనడా, యూఎస్‌, జర్మనీ, సింగపూర్‌, ఆస్టేల్రియా ఎగుమతి అయ్యేవి. ఇక మన దేశంలో  హైదరాబాద్‌, ఢిల్లీ, కొల్‌ కతా, చైన్నై, బెంగళూర్‌ వంటి నగరాల్లో కూడా వరంగల్‌ కొత్త వాడ జంపాఖానాలకు మంచి డిమాండ్‌ ఉంది. దర్రీలను తయారు చేయడమంటే ఆశామషి కాదు. ఎంతో ఓర్పుతో…. శ్రమతో వీటిని తయారు చేస్తారు. రోజు ఒక్కో నేతన్న గట్టిగా పనిచేస్తే నాలుగు దర్రీలను నేస్తారు. ఒక్కో దర్రీ ఖరీదు 300 రూపాయలు ఉంటుంది. ఇలా కొత్త వాడలో మొత్తం ఐదు వేల కుటుంబాలు ఈ దర్రీల తయారీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయ వృత్తి వదలక చాలా కుటుంబాలు ఈ వృత్తి పైనే ఉపాధి పొందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న కొత్తవాడ నేతన్నలకు ఇప్పుడు చాలా ఇబ్బందులున్నాయి.  హస్తకళా, గొల్కొండ సహకారంతో నేత కార్మికులు తమ వద్ద తయారైన దర్రీల డాక్యూమెంటరీతో…. చెన్నైలోని జిఐ సంస్థ కొత్తవాడలో తయారు చేసే దరీలకు భౌగోళిక గుర్తింపు జాబితలో చోటు కల్పించింది. ఒక ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తి నాణ్యమైనదే కాకుండా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. ఒక ప్రాంతంలోనే ఉత్పత్తి ఉంటే జీఐ గుర్తింపు ఇస్తారు. అనేక అంశాలు పరిశీలించి తయారీకి జీఐ  గుర్తింపు ఇస్తారు. జీఐ గుర్తింపు అంటే పేటెంట్‌ రావటం లాండిది. పేటెంట్‌ కేవలం యాజమాన్య హక్కును ఇస్తుంది. జీఐ మాత్రం ఉత్పత్తి విూద యాజమాన్యపు హక్కుతో పాటు నాణ్యతను, ప్రత్యేకతను తెలుపుతుంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇంతటి గుర్తింపు సాధించిన జంపాఖానాలను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఇక్కడి నేతన్నకు మొఖం చాటేస్తుంది. కొత్తవాడకు దేశంలోనే తొలిసారిగా చేనేతకు జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌ లభించింది. అయితే కొత్తవాడ జంపాఖానాలకు ఇంత ప్రఖ్యాతి ఉన్నప్పటికీ… చేనేత పనులు అంతరించిపోతున్న సమయంలో జీఐ టాగ్‌ లభించినా వారికి ప్రయోజనం లేకుండాపోయిందంటున్నారు నేతన్నలు. ప్రస్తుతం చేనేత ఉత్పత్తులను తెలంగాణ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ కార్పోరేటివ్‌ సొసైటీ…. కొనుగోలు చేస్తోంది. అయితే ఈ దర్రీలకు మార్కెట్లో అంతగా డిమాండ్‌ ఉండటం లేదని… వీటి స్థానంలో వేరే వస్త్రాలు తయారు చేయాలని చెబుతుండటంతో కొత్తవాడ నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ లో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అయితే అందులో అందులో విదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనివల్ల చేనేత చేతి వృత్తుల వారికి పెద్దగా  ప్రయోజనం ఉండదు. పవర్‌ లూమ్స్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుందంటున్నారు నేతన్నలు. కొత్తవాడలో చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న ఐదు వేల మంది చేనేత కుటుంబాల్లో…. కేవలం పెద్ద వారే ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. నేతన్నలకు గతమే ఘనం అన్నట్లు మిగిలిపోయింది. ఉత్పత్తి చేసిన దర్రీలను కొనేవారు లేక ఆదాయం తగ్గిపోయింది. దీంతో కొత్త జనరేషన్‌ ఇతర వృత్తులవైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు నేతన్నలు. ఇప్పటికే పోచం పల్లి, సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం సాయం అందిస్తున్న విధంగా కొత్తవాడ చేనేత కార్మికులకు సైతం అండగా ఉండాలని కోరుతున్నారు కొత్త వాడ నేతన్నలు. ఇంతకు ముందు ఇచ్చిన హెల్త్‌ కార్డులు కూడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్తం తొలగించిందంటున్నారు కొత్తవాడ నేతన్నలు. జీఐ ట్యాగ్‌ గుర్తింపు వచ్చినా తమకు ఏ మాత్రం
ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు నేతన్నలు. ప్లేన్‌ దర్రీలు రోజుకు ఒక మనిషి 4 దర్రీలు చేయగలరు. ఒక్కో దర్రీ విలువ 300 రూపాయలు ఉంటుంది. అదే 800 రూపాయల విలువ చేసే రంగులతో కూడిన జంపాఖానా రోజులో కేవలం ఒక్కటే ఉత్పత్తి చేయగలరు. దర్రీల తయారీకి సమయంలో ఎక్కువ తీసుకుంటుంది. శ్రమ ఎక్కువే అయినా తరతరాల నుంచి వస్తున్న వృత్తిని వదులుకోలేక పోతున్నారు. ఒకప్పుడు కొత్తవాడ దర్రీలు ఏడాదికి 40 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉండేది. గత ప్రభుత్వం కొత్తవాడ నేతన్నలు తయారు చేసిన జంపాఖానాలు కొనటం వల్ల తమకు ఉపాది మెండుగా దొరికిందని ప్రస్తుతం దర్రీల కొనుగోలు ప్రభుత్వం నిలిపివేయటంతో కేవలం 2 కోట్ల టర్నోవర్‌ మాత్రమే చేస్తున్నమంటున్నారు నేతన్నలు. కొత్త వాడ చేనేత వృత్తులు అంతరిస్తున్న సయమంలో……. ప్రాణం పోసినట్లుగా చివరి సమయంలో జీఐ టాగ్‌ రావటంతో…. నేతన్నకు వ్రుత్తి పై కొత్త ఆశలు చిగురించాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కొత్తవాడ నేతన్నలపై చిన్న చూపు చూడకుండా వీరి చేనేత ఉత్పత్తులు మార్కెట్‌ లో చెలామణి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.