వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు.. దంపతుల మృతి
వరంగల్: జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో.. ఎస్ఆర్ఆర్ తోటలో వృద్ధ దంపతులు మృతి చెందారు. విద్యుత్ శాఖ అదికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ వైర్లు తెగిపోయాయని… మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనగాం, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్, పరకాల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి, మొక్కజొన్న, పుచ్చకాయ, దోస, పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరంగల్ లో జనజీవనం స్తంభించింది.