వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

వరంగల్‌, జనంసాక్షి:  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది, ఎక్సైజ్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. 9 లక్షల విలువైన 25 ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.