వరంగల్ జిల్లాలో రైతు ఆత్మహత్య
వరంగల్, : తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. విజయదశమి పండగ మరునాడే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం వెంగళాపూర్‌లో లక్ష్మయ్య అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనతో వెంగళాపూర్ గ్రామంలో విషాదం అలముకుంది.