వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సీఐడీ తనిఖీలు
వరంగల్/మహబూబ్‌నగర్ : వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు ర్యాంకులు సాధించిన కార్పొరేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లికి చెందిన 11 మంది విద్యార్థులకు ఎంసెట్-2 పేపర్ అందినట్టు సీఐడీ అధికారులు నిర్ధారించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో కూడా సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూల్‌కు చెందిన అవినాష్ అనే విద్యార్థి ఇంటికి సీఐడీ అధికారులు రాగా… ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు.