వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు నేటినుంచి నామినేషన్లు
వరంగల్, : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం బుధవారం నుంచి ఆరంభమైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపధ్యంలో అన్ని రాజకీయ పక్షాలు తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగే అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. వరంగల్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడు అధిష్ఠానవర్గంతో చర్చించనున్నారు.టీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపిక కసరత్తు ముమ్మరమైంది.