వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై గులాబీ జెండా
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై గులాబీ జెండా రెపరెపలాడుతోంది. అటు అచ్చంపేటలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. విపక్షాలన్నీ కలసికట్టుగా బరిలోకి దిగినా కారు జోరు ముందు నిలవలేకపోయాయి. ఈ ఎన్నికల్లో పక్క రాష్ట్ర పార్టీ టీడీపీ అడ్రస్ గల్లంతైంది. ఓటర్లు పచ్చపార్టీని పూర్తిగా తిరస్కరించారు.
]హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబి జెండా ఎగిరింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కారు జోరు కొనసాగింది. వరంగల్ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 4, బీజేపీ 1, ఇతరులు 9 డివిజన్లలో విజయం సాధించారు.
వరంగల్లో డివిజన్ల వారిగా విజేతలు..
1-వీర భిక్షపతి(టీఆర్ఎస్), 2-బాలయ్య(టీఆర్ఎస్), 3-మౌనిక(టీఆర్ఎస్), 4-కవిత(ఇండిపెండెంట్), 5-స్వర్ణలత(టీఆర్ఎస్), 9-సోమిశెట్టి శ్రీలత(సీపీఎం), 10-రాజేందర్(టీఆర్ఎస్), 11-రాధిక(టీఆర్ఎస్), 12-సులోచన(టీఆర్ఎస్), 13-స్వర్ణలత(ఇండిపెండెంట్), 14-భాస్కర్(ఇండిపెండెంట్), 15-స్నేహలత(బీజేపీ), 20-రవీందర్(టీఆర్ఎస్), 21-రజిత(టీఆర్ఎస్), 22- భాగ్యలక్ష్మి(టీఆర్ఎస్), 23-వేణుగోపాల్(టీఆర్ఎస్), 24- అశ్రితా రెడ్డి(టీఆర్ఎస్), 25-రిజ్వానా షమీమ్(టీఆర్ఎస్), 26-జీ ప్రకాశ్ రావు(టీఆర్ఎస్), 27-గణేష్(టీఆర్ఎస్) 33-రాజు(కాంగ్రెస్), 34- రమేష్(టీఆర్ఎస్), 35-శ్రీలేఖ(ఇండిపెండెంట్ అభ్యర్థి), 36-ఎండీ అబుబక్కర్(టీఆర్ఎస్), 37- సాంబయ్య(టీఆర్ఎస్), 41-సిరాజుద్దీన్(టీఆర్ఎస్), 42-రవీందర్(టీఆర్ఎస్), 43-విద్యాసాగర్(టీఆర్ఎస్), 44-మురళి మనోహర్(టీఆర్ఎస్), 45-చాడ స్వాతి(బీజేపీ), 49-అరుణ(టీఆర్ఎస్), 50-విజయభాస్కర్(టీఆర్ఎస్), 51-మేకల స్వప్న(టీఆర్ఎస్) 52-రమ(కాంగ్రెస్), 53-మౌనికా రెడ్డి(కాంగ్రెస్)
ఖమ్మంలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఖమ్మం కార్పొరేషన్లో ఉన్నటువంటి మొత్తం 50 డివిజన్లలో.. టీఆర్ఎస్ 34 డివిజన్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 10, వైఎస్ఆర్ సీపీ 2, ఇతరులు 4 డివిజన్లలో విజయం సాధించారు.
ఖమ్మంలో డివిజన్ల వారీగా గెలుపొందింది వీరే..
1వ డివిజన్-రామ్మూర్తి(టీఆర్ఎస్), 2-గుగులోత్ పాపాలాల్ (టీఆర్ఎస్), 3-సరళ( టీఆర్ఎస్), 4-ఎస్ వెంకన్న(వైఎస్ఆర్ సీసీ), 5-ఎన్ కోటేశ్వర్ రావు(టీఆర్ఎస్), 6- హనుమన్(టీఆర్ఎస్), 7-సీహెచ్.నాగేశ్వర్ రావు(టీఆర్ఎస్), 8-వలరాజు(టీఆర్ఎస్), 9-షేక్ జాన్ బీ(టీఆర్ఎస్), 10-కే. నీరజ(టీఆర్ఎస్), 11-ప్రశాంతలక్ష్మి(టీఆర్ఎస్), 12-గాజుల వసంత(టీఆర్ఎస్), 13-ఆళ్ల నిరోష(టీఆర్ఎస్), 14-ఎం.మనోహర్రావు(టీఆర్ఎస్), 15-వి.రమణమ్మ(టీఆర్ఎస్), 16-కె.మురళి(టీఆర్ఎస్), 17-కొనకళ్ల నీరజ(టీఆర్ఎస్), 18-నరసింహారావు(టీఆర్ఎస్), 19-సయ్యద్ మీరా బేగం(టీఆర్ఎస్), 20-ధనలక్ష్మి(టీఆర్ఎస్), 21-కృష్ణ(టీఆర్ఎస్), 22-నారాయణరావు(టీఆర్ఎస్), 23-శశికల(టీఆర్ఎస్), 24-మురళి(టీఆర్ఎస్), 25-నరేందర్(టీఆర్ఎస్),26-పగడాల నాగరాజు(టీఆర్ఎస్), 27-కృష్ణవేణి(కాంగ్రెస్), 28-టెలెన్(సీపీఐ), 29-షాకత్ అలీ(టీఆర్ఎస్), 30-అఫ్రోజ్ సమీనా(సీపీఎం), 31-అక్కమ్మ(కాంగ్రెస్), 32-ఇందిరా(టీఆర్ఎస్), 33-రమ((టీఆర్ఎస్), 34-గోరెపెల్లి శ్వేత(వైఎస్ఆర్ సీపీ), 35-లక్ష్మీసుజాత(టీఆర్ఎస్), 36-చౌదరి(కాంగ్రెస్), 37-గంగాధర్ తిలక్(కాంగ్రెస్), 38-రమాదేవి(టీఆర్ఎస్), 39-పాపారావు(కాంగ్రెస్), 40-జయమ్మ(టీఆర్ఎస్), 41-కొప్పెర సరిత(టీఆర్ఎస్), 42-దేవి(కాంగ్రెస్), 43-శైలజ(సీపీఎం), 44-ఉమారాణి(కాంగ్రెస్), 45-వాణి(టీఆర్ఎస్), 46-లక్ష్మీ(కాంగ్రెస్), 47-నాగేశ్వరరావు(టీఆర్ఎస్), 48-తోట రామారావు(టీఆర్ఎస్), 49-భాస్కర్(టీఆర్ఎస్), 50-సక్కుబాయి(సీపీఐ)
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 20 వార్డులు ఉండగా అన్నీ ఆ పార్టీకే దక్కాయి.