వరంగల్ చేరుకున్న గవర్నర్ నరసింహన్
వరంగల్ : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రెండురోజుల పర్యటన నిమిత్తం వరంగల్ చేరుకున్నారు. ఉదయం మొదట ఆయన భద్రకాళి ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొంటారు. తర్వాత దుగ్గొండి మండలం ముద్దునూరులో చెరువు పూడికతీత పనుల్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి రామప్పకు వెళ్లి రామలింగేశ్వరస్వామినిదర్శించుకొని వరంగల్‌కోటలో పర్యటిస్తారు. రేపు వేయిస్తంభాలగుడిలో నిర్వహించే పూజలో పాల్గొంటారు.