*వరదకు కొట్టుకుపోయిన పత్తి చెన్లు

లబోదిబోమంటున్న రైతు లు*

. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కు ఎగువ నుండి వచ్చిన బారి వరదల వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిండి పోవడంతో దిగువ ప్రాంతానికి నీరు వదిలి పెట్టడంతో ఆయకట్టు క్రింద ఉన్న రైతులు వేసుకున్న పత్తి చెన్లు పూర్తిగా కొట్టుకుపోయినవి దండేపల్లి మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతమైన గుడిరేవు. లక్ష్మీకాంతపూర్ .ద్వారక.కొండాపూర్. కాసిపేట్. వెల్గనూర్ .నంబాల. గూడెం.ప్రాంత రైతుకు చెందిన వేలాది ఎకరాలల్లో వేసుకున్న పత్తి మొత్తం కొట్టుకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు పత్తి తోపాటు అక్కడ ఉన్న భూములు మొత్తం వరదతో కొట్టుకపోవడంతో .మళ్ళీ రెండు సంవత్సరాల వరకు భూములు సాగు కావని రైతులు వాపోతున్నారు .నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకుని పలువురు రైతులు కోరుతున్నారు