వరద బాధితులకు తనవంతు సహాయం చేసిన పీఏసీఎస్ చై
జనంసాక్షి న్యూస్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.వరదనీరు పంటపొలాల ఇండ్లలో నిరుచేరి పల్లెలన్ని తడిసి ముద్దయ్యాయి.రాకపోకలు నిలిచిపోవడం వలన నెరడిగొండ మండల కేంద్ర పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిషోర్ మానవత్వంతో ముందుకు వచ్చి మండలంలోని లింగట్ల గ్రామ ఎస్టి కాలనీ గోండుగూడ చింతగుడా నంద్యాతండా అను గ్రామ ప్రజలు భారీ వర్షానికి బయటకు వెళ్ళలేక ఏమి పనులు సాగక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆగ్రామ కుటుంబికులకు నిత్యావసర సరుకులు కూరగాయలను స్వయంగా వెళ్లి అందించడం వలన గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.