వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేత
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం
ఖానాపూర్ రూరల్ జులై 16 జనం సాక్షి : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తం కాగా రాజివ్ నగర్ కాలనీ అంతటా వరద నీరు చేరి నిత్యావసర వస్తువులతో పాటు అన్ని తడిచి పోయి బతుకు చిన్న భిన్నం అవడంతో రాజీవ్ నగర్ కాలానికి చెందిన నిరుపేద అయిన శికారి లక్ష్మి నారాయణ కుటుంబానికి శనివారం రూ.2500 ఆర్థిక సహాయం తో పాటు నిత్యావసర వస్తువులు అయిన బియ్యం పప్పులు కూరగాయలు అందించిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ లోని మిగతా నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు అందించి ఆదుకుంటానని నాకు తోచిన సహాయం చేస్తానని ప్రభుత్వం కూడా ఆదుకునే ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబాలకు పూట గడవడం కష్టం గా ఉన్న సమయంలో తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు కరోన సమయంలో కూడా పేద కుటుంబలని ఆదుకోవడానికి కష్ట పడి ఇప్పుడు వరదల వల్ల బాధిత కుటుంబాలను సైతం ఆదుకోవడం లో నేనున్నాను అనే భరోసా ఇస్తూ జడి వానలో ,వరదలు ముంచుకొస్తున్న సమయంలో కూడా లెక్క చేయకుండా కాలనీ లోని ఇండ్లలో వరదలకు ఎదురేల్లి భరోసా కల్పించిన రాజురా సత్యంను కాలనీ వాసులు అభినందించారు ఈ కార్యక్రమంలో 11 వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజుర సత్యం,నాయకులు అమనుల్లా ఖాన్ ,షబ్బీర్ పాషా, శెట్టి శ్యామ్,సలీం ఖాన్,కంటం రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగ నర్సయ్య,తోట సత్యం తదితరులు పాల్గొన్నారు…
Attachments area