వరద ముంపు ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
: జూలై 14( జనం సాక్షి) మండలంలోని మన్నూరు, టాకి గూడా గ్రామాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించివారి సమస్యలనుఅడిగితెలుసుకున్నారు
గతవారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకుతోషంగ్రామ
పంచాయతీలోని టాకిగూడా గ్రామ సమీపంలో గల వంతెన కొట్టుకు
పోయినప్రదేశాన్నిపరిశీలించివెం టనే అక్కడ తాత్కాలిక వంతెన నిర్మించాలని పంచాయితీ రాజ్ అధికారులకు ఆదేశించారు. మన్నూర్ ఎస్సీ కాలనీ పర్యటించారు ఇండ్లలో వరద నీరు చేరడంతో బాధితులను స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు భాదితులకు భోజన వసతితో పాటు వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు భాదితులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు గ్రామ ప్రజలు భారీ వర్షాలకు ఇంటిబయట వెళ్లకుండా అత్యవసరపరిస్థితులలో
బయట వెళ్లాలన్నారు.మండలంలో
వర్షాభావ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా చిన్న పిల్లలు గర్భిణీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. ఆమె వెంట ఆర్డిఓ రాథోడ్ రమేష్, తహసిల్దార్ సంధ్యారాణి, జెడ్పిటిసి బ్రహ్మానంద్, ఎంపీపీ భరత్, పంచాయతీరాజ్ ఏఈ కుందన్, ఎంపీడీవో సునీత, ఎంపిఓ లింగయ్య, మెడికల్ ఆఫీసర్ నీలోఫర్, నాయకులు జమీల్, బాలాజీ పస్తపురె టాకిగూడ గ్రామస్తులుతదితరులు ఉన్నారు.