వరిని వెదజల్లే పద్ధతిలో వేస్తే అధిక దిగుబడి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20 :: వరిని వెదజల్లే విధానంలో పండిస్తే అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ గ్రామంలో క్షేత్రస్థాయిలో వరిలో వెదజల్లే పద్ధతి గురించి మరియు  పాస్పో బ్యాక్టీరియా జీవన ఎరువు  ను ఉపయోగించే విధానం  గురించి  ప్రదర్శన నిర్వహించారు వెదజల్లే పద్ధతిలో సాధారణ నాటు పద్ధతిలో లాగే పొలాన్ని దమ్ము చేసే వీలైనంత బాగా చదును చేసుకోవాలని తెలిపారు. ఈ పొలంలో   మండే కట్టిన విత్తనాన్ని పొలమంతా సమానంగా పలుచటి నీటి పొర   ఉంచి  వెదజల్లాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20  సెంటిమీటర్ల కాలిబాటలు తీసిన తర్వాత  చల్లు కున్నట్లయితే  మొక్కల సాంద్రత  సమానంగా ఉండేందుకు వీలవుతుందన్నారు వెదజల్లే పద్ధతిలో   సాగు చేస్తే రైతులకు  7 వేల రూపాయల వరకు  పెట్టుబడి ఖర్చు ఆదా చేసుకోవచ్చని ఈ పద్ధతిలో కలుపు మొక్కలు,   వరి గింజల తో పాటే  మొలకెత్తుతాయ నీ. అందువల్ల కలుపు మందు తప్పకుండా వాడాలని తెలిపారు   కలుపు నివారణకు  విత్తిన 48 గంటలలోగా  ఒక ఎకరానికి  పెండిమిథాలిన్ కలుపు మందును 200  లీటర్ల నీటిలో కలిపి   తేమ ఉన్నప్పుడు   వాడాలని.  విత్తిన 20-25  రోజులకు వెడల్పకు  మరియు గడ్డి జాతి కలుపు గమనించినట్లయితే 80-100 మిల్లీలీటర్  బిస్పైరిబాక్ సోడియం 200  లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల లని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ  సంతోష్ కుమార్, రైతు యాదయ్య పాల్గొన్నారు.