వర్షంలో వాగుదాటి పంటలను పరిశీలించిన మండల ఎఓ బిర్రు భాస్కర్.
నెరడిగొండ జులై28(జనంసాక్షి):
పంటలపై ఆశించిన చీడపీడల నివారణకురైతులు చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ అన్నారు.గురువారం రోజున మండలంలోని దర్భ గ్రామంలో పంటలను మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ పరిశీలించారు.రైతు వారీగా వేసిన పంటలను క్రాప్ బుకింగ్ ఎనానసుమెంట్ యాప్ లో నమోదు చేసి జియో టాగింగ్ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వాగుదాటేసి రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాలు తగ్గాక వివిధ పంటల్లో పోషక యాజమాన్యం చీడ పీడల నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మరింత వ్యవసాయ సమాచారం కొరకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అపర్ణ రైతులు పాల్గొన్నారు.

Attachments area