వర్షం పడితే చాలు రాకపోకలు బంద్.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
చిన్నపాటి వర్షానికె వాహనదారులకు బోలెడంత కష్టాలు తప్పడంలేదని జాధవ్ మహేందర్ కల్యాణి అన్నారు.శనివారం కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కుంటాల జలపాతం వెళ్ళే రహదారికి సావుర్గాం గ్రామ సమీపంలో వాగుపై ఉన్న లో లెవల్ వంతెన ఉండడంతో చిన్న పాటి వర్షం పడిందంటే చాలు పైప్రాంతం నుంచి జోరుగా నీటి వరద ప్రవాహం వస్తుంది.మండలంలోని16 గ్రామస్తులు వాహనదారులు వాగు దాటే క్రమంలో చాలా  తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వంతెన నిర్మాణ చేపట్టాలని స్థానిక సర్పంచ్ జాధవ్ కల్యాణి మహేందర్ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం కురిసిన వర్షానికి వాగు పొంగిపొర్లుతున్నాయి.ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి చాలా ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. కుంటాల జలపాతం కు నిత్యం వెళ్ళే పర్యాటకులు
గ్రామస్తులు పడే ఇక్కట్లను వారి కష్టాలను అర్ధం చేసుకుని వంతెన నిర్మాణం చేపట్టాలని జనం కోరుకుంటున్నారు.

తాజావార్తలు