వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని కడం వాగు పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుఫ్టీ కుమారి గాజలి గాంధారి తర్నం వాగ్దారి మాదాపూర్ వెంకటాపూర్ కుంటాల తోపాటు పలు గ్రామాల్లోని పంట పొలాల్లో కడం వాగు ఉద్రిక్తతికి వేల ఎకరాల పంట నీటమునిగి ఇసుక దిబ్బలతో ఎడారిల తలపిస్తున్నాయి.అందుచేత ప్రభుత్వం వెంటనే గ్రామాక్షేత్రాలో సందర్శించి పంట నష్టాని అధికారుల ద్వారా అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మండల కిసాన్ సంఘం అధ్యక్షుడు జి రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున విలేకరులతో మాట్లాడుతూ వరదనీటికి గురైన పంట నష్టని సర్వే చేపట్టలని అన్నారు.ఇప్పటికే పంట నీట మునిగి రైతులు చాలా నష్టపోయారని పంట నీట మునిగిన రైతులకు ఎకరానికి 20 వేలు రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.అధిక వర్షంతో నీట మునిగిన ఇండ్లకు పునర్నివాసం కల్పించి డబుల్ బెడ్రూం ఇళ్ళను మంజూరు చేయాలని వర్షపు నీరు చేరి ఇంట్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యాయి.వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.