వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అదిలాబాద్ పట్టణం లో *ఆజాదిక గౌరవ యాత్ర…*
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టిపిసిసి ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామ్ చంద్రారెడ్డి నివాసం నుండి పాదయాత్ర ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భారీ ఎత్తున హాజరై త్రివర్ణ పతాకాలతో పాదయాత్ర ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని ప్రధాన కూడళ్లో ర్యాలీని కొనసాగించారు. ముందుగా వినాయక చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, దేవిచంద్ చౌక్, గాంధీ, చౌక్, శివాజీ చౌక్, తిర్పల్లి, కిసాన్ చౌక్ , నైరు చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ చౌక్, కలెక్టర్ చౌక్, వరకు పాదయాత్ర ర్యాలీ నిర్వహించి వినాయక్ చౌక్ లో ముగించారు..
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ…. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయులను గుర్తు చేసుకుకోవడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మ గాంధీ, భగత్ సింగ్, రాజ్గురు సుక్ దేవ్, లాంటి మహనీయులు దేశం కొసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడారని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అభివృద్ధి పథకాలను మైమరుస్తూ మత విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తూ దేశ ప్రజల సొమ్మును అదాని ,అంబానీలకు కట్టబెడుతుందన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సైతం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.దేశంలో ఎన్నడు లేని విధంగా జిడిపి పతనం అవుతుంటే, త్రివర్ణ పతాకాన్ని యువత డిపి లుగా పెట్టాలని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైల్వే,విమానయానం, మొదలైన సదుపాయాలను కల్పించి దేశ ప్రజలకు వెన్నంటు ఉందన్నారు. దేశ జాతీయ పతాకాన్ని గౌరవించని బిజెపి ఆర్ఎస్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు దేశభక్తి ఔన్నత్యం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయని కానీ 8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ జీఎస్టీ పేరుతో నిత్యవసర ధరలను అమాంతంగా పేంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల్లో దొడ్డి దారిన అధికారంలో వస్తు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. ఇటు రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటి వరకు అది అమలు చేసిన దకిలలు లేవన్నారు.దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ రేటు ఆకాశాన్ని అంటుతుందన్నరు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం తో చీకటి ఒప్పందాలు చేసుకొని తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికలలో ఓటును ఆయుధంగా చేసుకొని బిజెపి తెరాస పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఇంచార్జ్ ఓడినాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు భూపెల్లి శ్రీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జెడ్పిటిసి చారులత రాథోడ్, నాయకులు యసం నర్సింగ్ రావు, దిగంబర్ రావు పాటిల్, గజేందర్, రాందాస్ నక్లే, సెద్మకి ఆనందరావు, నగేష్, మహేందర్ ,ఇమామ్ భాయ్, రాజేశ్వర్, నారాయణరెడ్డి, రాహుల్ చంద్రాల, షకీల్, మునిగేల నర్సింగ్, చంటి పాసుల ,మోతిరామ్, శాంతన్ రావు, కల్చపురెడ్డి, సంతోష్ కాడే, అఫ్రోజ్, సాదిక్ ,రాజు యాదవ్ ,సత్తార్ ,జాహీద్, ఖలీమ్ ,సంతోష్ ,తదితరులు పాల్గొన్నారు.