వర్షాలు భారీగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి
హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షానకి పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. పశ్యిమ గోదావరి జిల్లా కాకినాడలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రంగంపేట, రాజానగరం మండలాల్లో వర్షాలతో పంటలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో వర్షానికి భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. విశాఖ జిల్లా అరకులో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి.