వర్షాల కారణంగా 10 రైళ్ల రద్దు

హైదరాబాద్‌: వర్షల కారణంగా 10 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రథ్‌, విశాఖ-సికింద్రాబాద్‌ దూరంతో, మణుగూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌- మణుగూరు, మణుగూరు-కాజీపేట, కాజీపేట-మణుగూరు, కాజీపేట-డోర్నకల్‌-కాజీపేట, కాజీపేట-విజయవాడ, విజయవాడ-కాజీపేట ప్యాసింజర్లు రద్దు చేశారు. కాజీ పేట- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు.