వాటికన్ సదస్సుకు మమతకు దక్కని అనుమతి
న్యూఢల్లీి,సెప్టెంబర్25 (జనంసాక్షి); వాటికన్లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అనుమతి లభించలేదు. ఆమెకు అనుమతి ఇచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. మదర్ థెరీసాపై ఈ సదస్సు జరుగుతుంది.
సదస్సులో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రఘి పాల్గొంటారు. ఇదిలావుండగా, ఈ సదస్సుకు ఎటువంటి ప్రతినిధి బృందాన్ని తీసుకురావద్దని ఇటలీ ప్రభుత్వం మమత బెనర్జీని కోరింది. దీనిపై మమత స్పందిస్తూ, పారిశ్రామిక ప్రతినిధుల బృందం కోసం అనుమతిని కోరారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆమెకు అనుమతి లభించలేదు. అక్టోబరు 6, 7 తేదీల్లో జరిగే ఈ సదస్సులో ఈజిప్టుకు చెందిన అహ్మద్ అల్ తయ్యిబ్ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. రోమ్‌లోని కేథలిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మేక్రో ఇంపాగ్లియాజో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఆహ్వానించారు.