వాట్సాప్ ఫిర్యాదులకు తక్షణ స్పందన :జిల్లా ఎస్పీ
సంగారెడ్డి,మార్చి9(జనంసాక్షి): జిల్లాలో ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళలపై గృహ హింస, వరకట్న దాడులు, హత్యలు, ఈవ్‌టీజింగ్, వేధింపులు వంటివి జరిగినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుమతి అన్నారు. చట్టాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇలాంటి వారి ఆటకట్టించడానికే ‘వాట్సాప్’ ద్వారా సమాచారం చేరవేయాలని కోరారు. లేదా 9490617555 ఫోనుకు సమాచారం ఇచ్చినా చాలన్నారు. ఇలా వచ్చే ఫిర్యాదులపై తోణం స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓ మహిళా అధికారిగా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నిందితుల భరతం పడతామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వాట్సాప్ సేవలను ఆమె ప్రారంభించారు. దీనిద్వారా వచ్చే సమాచారం ఆధారంగా నిందితులపై చర్య తీసుకుంటామని అన్నారు. ఇకనుంచి వాట్సాప్ సమాచారంపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. హిళలపట్ల చిన్నచూపు పోవాలని, వారిపట్ల గౌరవం పెంచుకోవాల్సి ఉందన్నారు. వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడానికి జంకేవారు స్వేచ్ఛగావాట్సాప్ మాధ్యమాన్ని వినియోగించుకుంటారని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. నిర్భయంగా పోలీసు హెల్ప్‌లైను నెంబరు 9440901835, 08455- 276441, 100కు ఫోను చేయాలని సూచించారు. పోస్టర్లరు గ్రామ పంచాయతీలు తదితర ప్రదేశాల్లో ప్రజల చైతన్యం కోసం ఉంచుతామని సుమతి తెలిపారు. ఆడపిల్ల అంటే అన్ని విషయాల్లో చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. కౌమార దశలో ఆడపిల్లలకు మంచి చెడులను తల్లిదండ్రులు తెలియజేస్తే తప్పటడుగులు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మన కుమారులు ఆడపిల్లలను గౌరవించినప్పుడే తల్లిగా విజయం సాధించినట్లవుతుందని పేర్కొన్నారు.