వాతావరణ మార్పులతో ప్రకృతి ప్రకోపం

ఉత్తరాఖండ్‌,కేరళ విధ్వంసాలు సజీవ సాక్ష్యాలు
న్యూఢల్లీి,అక్టోబర్‌21  జనం సాక్షి ; అక్టోబర్‌ మాసంలో విచిత్ర వాతావరణ స్థితిగతుల కారణంగా వర్షాలు విపరీతంగా కొడుతున్నాయి. అల్పపీడనంతో పడుతున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల నిష్కమ్రణలో జాప్యం, అరేబియా సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ ఒకేమారు అల్పపీడనాలు ఏర్పడటం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు. నైరుతి రుతుపవనాల నిష్కమ్రణ సెప్టెంబరు రెండోవారానికల్లా పూర్తికావాల్సింది పోయి, అక్టోబరు తొలివారాన్ని కూడా దాటడం కారణంగా దక్షిణాదిప్రాంతాలైన తెలుగు రాష్టాల్రు, కర్నాటక, కేరళలలు అధికవర్షాలు ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తులు కొత్తేవిూ కాకున్న వరుసగా జరుగుతున్న ప్రమాద పరిస్తితులు వాతావరణంలో విపరీతమైన మార్పుల తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. క్యుములో నింబస్‌ మేఘాల కారణంగా అప్పటికప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పు, పర్యావరణపరిరక్షణ వంటి విషయాల్లో మనం ఎంతగా అలసత్వంగా ఉన్నామో అర్థం చూసుకోవచ్చు. సముద్రజలాల వేడి క్రమంగా హెచ్చుతున్న తరుణంలో, అత్యంత బలహీన తుపానులు కూడా బలపడి ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలోనూ గత కొద్దిరోజులుగా వరుస సైక్లోన్లు ఏర్పడుతున్నాయి. ఇలా ఉత్పాతాలు చుట్టుముట్టడంతో ప్రాణనష్టంతో పాటు ఆర్థిక నష్టం విపరీతంగా ఉంటోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కారణాలతోనే భారీవరదలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలమైపోతున్నది. వంతెనలు కూడా కొట్టుకు పోతున్నాయి. మృతుల లెక్కలు ఏ
రోజుకారోజు సవరించుకోవలసిన స్థాయిలో ప్రకృతి ప్రకోపం ఉన్నది. రాష్ట్రంలోని 13జిల్లాల్లో పదిజిల్లాలు అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమైనాయి. పన్నెండేళ్ళక్రితం ఇదే అక్టోబరు మాసంలో 24 గంటల్లో కురిసిన అతి భారీ వర్షం రికార్డు ఇప్పుడు 20గంటల్లోనే చెరిగిపోయిందని అంటున్నారు. నైనితాల్‌ సరస్సు గతంలో ఎప్పుడూ లేనంతగా పొంగిపొర్లింది. వరద ఉధృతికి వంతెనలు కొట్టుకుపోయాయి, కొండచరి యలు విరిగిపడి ఇళ్ళు నేలమట్టమైనాయి, కార్లతో సహా పలువాహనాలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర పర్యాటకరంగానికి కీలకమైన చార్‌ధామ్‌యాత్రవిూద విశేష ప్రభావం చూపింది. యాత్రలు నిలిచిపోవడంతో పాటు, వీటికోసం దేశంలోని చాలాప్రాంతాలనుంచి వచ్చి చిక్కుకున్నవారినీ, రిసార్టుల్లో ఉన్నవారినీ అధికారయంత్రాగం సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. మంచుచరియలు విరిగిపడిన కారణంగా భారీ జలప్రళయాన్ని చూసాం. రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ధ్వంసం కావడంతోపాటు, డ్యాములు, రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్ళు తదితరం కొట్టుకుపోయాయి. వాతావరణమార్పు అక్కడి ప్రకృతి సహజసిద్ధమైన పక్రియలను దెబ్బతీసింది. హిమాలయాలు అధికంగా కరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రాజకీయనాయకుల లాలూచీ వల్ల అవసరం లేకున్నా పుట్టుకొస్తున్న భారీ ప్రాజెక్టులు, వాటికోసం జరుగుతున్న పేలుళ్ళ వంటి ఘటనలు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసాన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రకృతి ప్రకోపం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.