వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 :
భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంపై కాంగ్రెస్‌, ప్రధానమంత్రి కార్యాల య అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం మీడియా అడ్వాయి జర్‌ సైతం లెటర్‌ రాయడం జరిగింది. ఈ కథనం ఆమోదయోగ్యం కాదంటూ ప్రభుత్వం సైతం నిరసన తెలిపింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని, ఎల్లో జర్నలిజానికి ప్రతీక అంటూ సమాచార ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోని అభిప్రాయపడ్డారు. దీనిపై విదేశాంగ ఇతర ప్రభుత్వ విభాగాలతో చర్చించి పత్రికపై చర్య తీసుకుంటామని ఆమె తెలిపారు. కథనం రాసిన డెన్యర్‌కు ప్రధాని కార్యాలయం నిరసన తెలియజేసింది.

తాజావార్తలు