వాసవి క్లబ్ ల సేవలు విస్తరించాలివాసవి క్లబ్ ల సేవలు విస్తరించాలి – మంత్రి జగదీష్ రెడ్డి


సూర్యాపేట ప్రతినిధి , ఫిబ్రవరి 20 (జనంసాక్షి): వాసవి క్లబ్ లు తమ సేవలను విస్తరించాలని, మరింతగా పేద ప్రజలకు సేవలను అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104 డిస్ట్రిక్ట్ ,  వాసవి క్లబ్ సూర్యాపేట, ఇతర క్లబ్ ల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. వాసవి క్లబ్ ల ద్వారా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు వ్యాపారం కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం హర్షణీయమని అన్నారు.చనిపోయిన ఆర్యవైశ్య కుటుంబానికి వాసవి కుటుంబ సంక్షేమ పధకం ద్వారా ఐదు నుండి పది లక్షల వరకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నారు.స్వచ్ఛంద సంస్థలు సేవ చేయడానికి అనేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.ప్రభుత్వం సహాయం చేయలేని చోట వాసవి క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసి ప్రజలను ఆదుకోవాలని సూచించారు.సూర్యాపేట పట్టణంలో తమ వంతు సేవలు అందిస్తున్న వాసవి క్లబ్ సభ్యులను అభినందనందించారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా  ఎన్సిసి విద్యార్దులకు షూ పంపిణీ చేశారు.అంగన్వాడీలకు ఆర్దిక సహాయం అందజేశారు. నిరుపేద మహిళలకు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బెలిదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ ఇరుకుల రామకృష్ణ, యాదా నాగేశ్వరరావు చైర్మన్ ఫైనాన్స్, ఎన్నికలు, ప్రాజెక్టులు వాసవి క్లబ్ ల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,తెలంగాణ డైయిరీ డెవలప్మెంట్ చైర్మన్ సోమా భరత్ కుమార్,బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్, మీలా వాసుదేవ్,  బండారు రాజా, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, గోండ్రాల అశోక్, చల్లా లక్మికాంత్,  కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, జిల్లా గవర్నర్ వంగవేటి గురుమూర్తి, సింగిరికొండ రవీందర్, బండారు సత్యనారాయణ, తోట శ్యామ్ ప్రసాద్, గుండా శ్రీదేవి, రాచర్ల కమలాకర్, కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, పివివి లక్ష్మినారాయణ, గుండా శ్రీధర్, తల్లాడ సోమయ్య, గుండా ఉపేందర్, పబ్బతి ప్రవీణ్, పబ్బతి వేణుమాధవ్, బండారు రమేష్, గుండా మురళి, వంగవేటి రమేష్, వెంపటి శభరినాధ్, బిక్కుమళ్ల క్ర్రష్ణ, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.