వాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి

పునరా

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి):
పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల, ఇంజనీర్లు, తహసిల్దార్లకు , అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు జిల్లాలోని పునరావాస కేంద్రాల అయిన ర్యాలంపాడు, నాగర్ దొడ్డి, ఆలూరు, చిన్నోని పల్లె సెంటర్లలలో పనులు వేగo పెంచాలన్నారు. ర్యాలం పాడు ఎలక్ట్రిసిటీ కి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని, ఎస్టిమేట్ సబ్మిట్ చేయాలనీ అన్నారు.డ్రైనేజీలు, నీటి సరఫరా, రోడ్లుకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. నాగర్ దొడ్డి లో మంజురైన పనులు మొదలు పెట్టాలని, చిన్నోన్ని పల్లి,గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆలస్యం చేయకుండా సంబందిత ఇంజనీర్లు పనులు చెయిoచాలని అన్నారు. పెండింగ్ పనులను ప్రదాన్యతగా బావించి పూర్తి చేయాలనీ, ప్రతివారం పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలు పంపాలని ఆదేశించారు .అనంతరం రెవెన్యూ కు సంబంధించి తహసిల్దార్ల పరిదిలో డిసెంబర్ నెల వరకు పెండింగ్ ఉన్న దరణి కి సంబంధించి ఇనాం భూముల సమస్యలను ఒక వారం టైం తీసుకొని తక్షణమే పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ఎస్సి, ఎస్సి టి విద్యార్థులకు కులం, ఆదాయం సర్టిఫికేట్ లు మీ సేవ ద్వారా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ శ్రీనివాసరావు, రహీముద్దీన్ ,ఆర్ డి ఓ రాములు , విద్యుత్ అధికారులు , సంబందిత మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.