విఅర్ఎల సమ్మెకు మద్దతు సిఐటీయూ నాయకులు.
నెరడిగొండఆగస్టు5(జనంసాక్షి):
రాష్ట్రవ్యాప్తంగా గత రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెలకు మద్దతుగా నెరడిగొండ మండల తహాశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న దీక్షలకు సీఐటీయూ మండల అధ్యక్షుడు నక్కల లక్ష్మన్ కార్యదర్శి గాజుల రాజేందర్ సీఐటీయూ సీనియర్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యోగ భద్రత, వీఆర్ఏలకు పేస్కేల అమలు చేయాలని అన్నారు.వారు చేస్తున్న ఆందోళన డిమాండ్స్ సరైనదేనని ప్రభుత్వం వీరిని అన్ని విధాలుగా ఉపయోగించుకొని నేడువారిని నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని వారు ఆరోపించారు. వీఆర్ఏలు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Attachments area