విఆర్ఎ ల సమస్యలు పరిష్కరించాలి..
బేల, జూలై ( జనం సాక్షి ) : విఆర్ఎ లకు పేస్కేల్ తో పాటు అర్హులైన విఆర్ఎ లకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విఆర్ఎ జెఎసి పిలుపు మేరకు మండల కేంద్రము లోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 55 సంవత్సరాలు పై బడిన వారికి వారసత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబ సభ్యులను అదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విఆర్ఎ లు పూసాం సంజయ్, సాత్మారాం, ప్రహ్లాద్, శామ్ రావ్ తదితరులు పాల్గొన్నారు..