విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని విధులకు దూరం.
జనంసాక్షి న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున రాష్ట్ర విఆర్ఏ జెఎసి పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం మండల గ్రామ సేవకుల సంఘం తరఫున సోమవారం రోజున తసీల్దార్ పవన్ చంద్రకు సమ్మె నోటీసు ఇచ్చారు.తాసిల్దార్ కార్యాలయంలో నిత్యం పనిచేసే గ్రామ సేవకులు ఈ నెల19నుండి విధులకు దూరంగా ఉంటూ గ్రామాల్లో విధులు నిర్వహిస్తమని గ్రామ సేవకుల సంఘం మండల అధ్యక్షులు విలేకరులకు తెలిపారు.నూతన రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామ సేవకులకు అన్ని విధాల ఆదుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయాలని,రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించకుండా మారుమూల గ్రామాల్లో గ్రామ సేవకులు విధులు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.ఈనెల 25 తారీకు వరకు గ్రామ సేవకుల డిమాండును ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇస్తేనే సమ్మెను నిలిపివేస్తామని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులు జేఏసీ సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. గ్రామ సేవకులకు అధికారులు రెవిన్యూ కార్యాలయంలో వివిధ రకాల పనులను గ్రామ సేవకుల సేవలను వాడుకుంటూ వస్తున్నారు తప్ప వారి ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు.ప్రభుత్వం గ్రామ సేవకులకు పిలిపించి చర్చల ద్వారా వారి డిమిండ్లను పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు యధావిధిగా విధులకు హాజరుకాకుండా 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెను భారీ సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సమ్మె చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area