*విఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

లింగంపేట్ 29 జూలై (జనంసాక్షి)
 గత ఐదు రోజులుగా లింగంపేట్ మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్ఏలను శుక్రవారం లింగంపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లమడుగు షరీఫ్ మాట్లాడుతు విఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారిని ఆదుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసి విఆర్ఏలకు హామీ ఇచ్చినమాట నిలబెట్టుకొని వారికి పేస్కేల్ కల్పించి న్యాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజు లింగా గౌడ్ రాజేశ్వర్ రెడ్డి పూల్ సింగ్ రాజు శీను పాష సిద్దు మహారాజ్ హర్షిత్ లక్ష్మణ్ రాజు రెడ్డి శ్రీనివాస్ గౌడ్ భాస్కర్ సంతోష్ గోపాల్ కృష్ణమూర్తి ఆనంద్ అక్తర్ సందీప్ బలరాం మోహన్ లింగం ప్రశాంత్ కుమ్మరి సాయిలు పూల్ స్సింగ్ సాయిలు రవి బాబా సాయిలు గోపాల్ విఆర్ఏలు ఉన్నారు.
Attachments area