విఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

వేములవాడ జులై 27 (జనంసాక్షి) తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విఆర్ఏ లు వేములవాడ లోని తెలంగాణ చౌక్ వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు,
వీఆర్ఏ లకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షులు సాగరం వెంకట స్వామి, ముడిగ చంద్రశేఖర్, మండల అధ్యక్షులు వకలబరణం శ్రీనివాస్, ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, మద్దతు తెలిపారు, ఆనంతతం వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పెస్కెల్ అమలుచేస్తూ పదోన్నతులు కల్పించాలని అలాగే 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు,సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని లేనియెడల వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు నాయకులు ఉన్నారు