విఓల సమస్యలు పరిష్కరించాలి
గుడిహత్నూర్: మార్చ్ 24( జనం సాక్షి).విఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఓఏ లు శుక్రవారం ఐకేపి ఏపీఎం కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఓఏ లను సెర్ప్ ఉద్యోగుల గా గుర్తించాలని కనీస వేతనం 26వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అర్హులన వారికి సిసిలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ 4వ తేది వరకు అన్ని రకాల ఆన్ లైన్ పనులు నిలిపివేస్తున్నట్లు వారు వినతిపత్రం లో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విఓఏ సంఘం మండల అధ్యక్షుడు నిరటి మనోహర్, కోశాధికారి జాడి రవీందర్, కార్యదర్శి రంగు చంద్రకళ, సలహాదారులు రాజేష్, వెంకట్, ధనలక్ష్మి,గంగారాం తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.