వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన హమీద్ అశ్విన్ బౌలింగ్ లో లెగ్ భిఫోర్ గా ఔటయ్యాడు. అంపైర్ లెగ్ బిఫోర్ గా ఔటయినట్లు ప్రకటించిన తరువాత హమీద్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి ఆఫ్ స్టంప్ కు తాకుతుందని స్పష్టంగా తేలడంతో హమీద్ వెనుదిరగక తప్పలేదు.