విగ్నేశ్వర విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.
తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి)తాండూర్ పట్టణం పలు విధులలో ప్రతిష్ఠాపన చేసిన వినాయకులను శనివారం రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు శుభప్రద్ పటేల్ ను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు. భక్తులు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొవాలని కోరారు. అనంతరం వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాను, బాలు, హరీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.