విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించిన సబ్ ఇన్స్పెక్టర్ దాస సుధాకర్

 

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4:
మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల శ్రీ పార్వతి చంద్రశేఖర ఆలయంలో శాంతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి మండపం వద్ద ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు‌. స్థానిక ఎస్సై దాస సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై దాస సుధాకర్ మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అలాగే నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. శివాలయం అర్చకులు ఆకవరంమఠం శివప్రసాద్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై తప్పక ఉంటుందన్నారు.విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యలతో, సుఖసంతోషాలతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు ఆకవరంమఠం సాయి, విగ్రహదాత చిటుమల్ల కనకలక్ష్మి-వైకుంఠం, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, ఉత్సవ కమిటీ సభ్యులు ఉల్లెంగుల శ్రీకాంత్, కోనేటి అజయ్, పెనుకుల శివకృష్ణ(అంబి)సింగాపురం శివ, బుర్ర సాయి, తేరాల అమర్, వరుకోలు దిలీప్, కోనేటి అంజనీ ప్రసాద్, పొన్నం శ్రీకాంత్,ఈగ ఏడుకొండలు, ఉల్లెంగుల ప్రణయ్, దాసరి శ్రీవాత్సవ, ఏనుగు జశ్వంత్ రెడ్డి, గూడెం విష్ణుచరణ్, సూరం సాయిచరణ్ , సింగాపురః శశి, నాంపల్లి రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.