విజయ దశమితో ఇంద్రవెల్లి అమరుల త్యాగం సిధించాలి.
జనం సాక్షి ఉట్నూర్.
విజయ దసమిని పురస్కరించుకుని ఇంద్రవెల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల వాసులకు,పెద్దలకు విజయ దశమి శుభకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు,ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో,ఖానాపూర్ నియోజకవర్గంలో దొరల పాలన కంటే అధ్వానంగా పాలన నడుస్తుందని,ఈ విజయ దసమితో అయిన ఇంద్రవెల్లి అమరుల త్యాగం సిందించి పోడు భూములకు పట్టాలు ఇచ్చి, అమరుల కుటుంబాలను గుర్తించి ప్రతి దసరా రోజు వారి దసరా కార్యక్రమం ప్రభుత్వము నిర్వహించాలన్నారు.ఖానాపూర్ నియోజకవర్గం లో 30 సంత్సరల కాలంగా పాలిస్తున్న పాలకులు ఈ ప్రాంత ప్రజల తలరాతను మార్చలేక పోయారని గత 30 సంత్సరకాలంగా ఉన్న చేడు పాలనను విజయ ధసమితో అంతం చేసి రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నారు.వారి వెంట మండల అధ్యక్షుడు సోమరే నగోరావు మాజీ చైర్మన్ వెంకట్రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీర్జా యాకూబ్ బెగ్ గాయకాడ్ దీలిప్ ముబిన్ తధితరు ఉన్నారు.