విజ్ డమ్ హై స్కూల్ లో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు
జనం సాక్షి: నర్సంపేట
జాతీయ భాషయైన హిందీ దినోత్సవం సందర్భంగా విజ్ డమ్ హై స్కూల్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. త్రి భాష సూత్రం ఆధారంగా ప్రతీ వ్యక్తి మాతృభాషతో పాటు జాతీయ భాష అయిన హిందీని విధిగా నేర్చుకోవాలని, తద్వారా మనం దేశంలోని ఏ ప్రాంతం లో నైనా పర్యటించవచ్చని, హిందీ సరళమైన భాష అని, దీని లిపి దేవ నాగరి అని, దీనిని నేర్చుకోవడం అతి సులభమని పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. హిందీ ప్రాముఖ్యతను విషయోపాధ్యాయులు కొనియాడారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, అకాడమిక్ ఇన్చార్జి రహీమొద్దిన్, ఇలియాస్, రియాజ్, ఫర్జానా, యాస్మిన్, వీరభద్రయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area