విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆమన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సొంత జిల్లా మెదక్‌లో ఈ నెల 29న ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఇందిరమ్మ కలలు కార్యక్రమానికి రాజనర్సింహ గైర్హాజరు అవుతుండటంతో ఇద్దరి నేతల మధ్య అగాధం మరింత పెరిగినట్లయింది.