*విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి*

– తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి

మునగాల, జూలై 29(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునగాల మండలంలోని వివిధ పాఠ శాలల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్య్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు పదోన్నతులు మరియు సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్  వెంటనే నియమించి పాఠశాలల పరిశుభ్రతను కాపాడాలని  కోరారు. 100 శాతం పుస్తకాలు పంపిణీ చేయాలని, పిల్లలకు ఏక రూప దుస్తులు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మాధవరం, నేలమర్రి, వెంకట్రామపురం, తాడ్వాయి, కలకోవ, రేపాల, సీతానగరం, నర్సింహులగూడెం, మునగాల గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్య,క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యుటిఎఫ్ మండల అధ్యక్షులు గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ, సీనియర్ కార్యకర్తలు లక్ష్మణాచారి, శ్రీదర్ రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.