విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి-

ఎస్ ఎఫ్ ఐ విద్యార్ది సంఘ బంద్ విజయంతమైంది

ఎస్ ఎఫ్ ఐ -జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం

జనగామ (జనం సాక్షి)జూలై20:
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర పిలుపులో బాగంగా ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది..ప్రవేటు యాజమాన్యాలు ముందస్తుగా స్వచ్ఛందంగా బంద్ ని ప్రకటించినారు… ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులతో నెహ్రూ పార్కు నుండి బస్టాండ్ చౌరస్థాలో వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం మాట్లాడుతూ..
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.కాళీగ ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చెయ్యాలని. అలాగే పెండింగ్ స్కాలర్షిప్ రియంబేర్స్ మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నూతన జాతీయ విద్యావిధానం ఎన్ ఈ పి 2020ను రద్దు చేయాలని,విద్యావ్యాపారీకరణ కాషయకరణను వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు, పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటికి చాలా ప్రభుత్య పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వక పోవడం, యూనిఫాంలు అందించకపోవడం సిగ్గు చేటని, పాఠశాలలకు సరిపడా నిధులు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలనీ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు రమేష్ తరుణ్ నాయక్ యకన్న, అంజలీ ప్రియాంక నాగేందర్ యాకు వెంకటేష్ రామ్ ప్రసద్ ఉసేన్ వికాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.