విద్యార్థి దశ నుండే న్యాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి.
టిఆర్ఎస్ వి డివిజన్ ఇంచార్జీ జిలాని.
తాండూరు అగస్థు 16(జనంసాక్షి)విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవరచు కోవాలని టిఆర్ఎస్వి డివిజన్ ఇంచార్జి జిలాని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆద్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణం కళాశాల స్థాయిలో విద్యార్థులకు భారత స్వతంత్రోద్యమంలో స్వతంత్రం కోసం పోరాడిన నాయకుల పాత్ర, అనే అంశంపై వ్యాస రచన పోటిని స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ వి డివిజన్ ఇంచార్జీ జిలాని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలనుఅలవరచుకోవాలని సూచించారు. స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందిన అమరులను గుర్తు చేసుకోవాలని కోరారు. అదే విధంగా విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదువుకునితమ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని కోరారు. సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు లభిస్తాయి అని పేర్కొన్నారు .వ్యాసరచన పోటీలో ప్రథమ, ద్విఆయ. తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ప్రముఖుల చెతులమీదుగా. ప్రథమ బహుమతి సిల్ వర్ మేడల్ , దృతీయ, తృతియి బహుమతి ప్రైజ్మని ఉంటుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థు పాల్గోన్నారు.