విద్యార్థులకు బహుమతులు ప్రదానం.

ఫోటో రైటప్: బహుమతులు అందజేస్తున్న సర్పంచ్.
బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామ పంచాయతీలో సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ గొర్లపల్లి బాపు బహుమతులు ప్రదానం చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పల్లవి, ఉపాధ్యాయురాలు మాలతి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కామెర దుర్గయ్య, అంగన్వాడీ కార్యకర్త రేఖ, తదితరులు పాల్గొన్నారు.