విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

తాండూరు అగస్టు 13(జనంసాక్షి)ఆజాది క అమృత్ మహోత్సవ్ సందర్భంగా పెద్దేముల్ మండలం గోట్లపల్లి మోడల్ స్కూల్ కు హన్మాపూర్ మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపిటిసి లోంక నీలు నర్సింలు  25 వేల రూపాయలతో డిజిటల్ సౌండ్ సిస్టం మైక్ సెట్ బహుకరణ.   వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గోట్లపల్లి మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ సుమారుగా 400 మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రార్థన సమయములో పాఠశాలలో మైక్ సెట్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో  ఉపాధ్యాయులు విద్యార్థులు విజ్ఞప్తి మేరకు  ఇట్టి విషయాన్ని సోషల్ వర్కర్ వెంకట్ దృష్టికి తీసుకురాగా  వెంటనే హన్మాపూర్ మాజీ సర్పంచ్ లొంక నరసింహులు దృష్టికి తీసుకురావడంతో  పదవ తరగతి విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో హామీ ఇవ్వగా ఆజాద్ కి అమృత్ మహోత్సవం లో భాగంగా శనివారం పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్థులకు 25వేలతో డిజిటల్ మైక్ సెట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పాఠశాలకు తనవంతుగా సహాయం అందిస్తానని మోడల్ కాలేజ్ హాస్టల్ విషయంపై విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థులు చక్కగా చదివి భవిష్యత్తులో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ  నాయకులు అంకిత్ మాట్లాడుతూ పాఠశాలకు తమవంతుగా 15000/-వెయులు రూపాయలు సాయం అందిస్తామని మండలంలోని మంచి రిజల్ట్ సాధించి మోడల్ స్కూల్ మరొకసారి మారుమోగాలన్నారు . కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్, రామ్ రెడ్డి,రవితేజ అడ్వకేట్ ,శీను డీలర్,చిన్నారెడ్డి ,అనంతయ్య,ఎన్ ఎస్ యు ఐ  అంకిత్ , ఎబినేజర్ ఉపాధ్యాయులు రవీందర్. ప్రశాంత్ రెడ్డి. బాలరాజు .సత్యై య్య.కిరణ్ ,స్కూల్ స్టాప్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area