విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ ఆదేశానుసారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ.
బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ చారి.
తాండూరు ఆగస్టు 19 (జనం సాక్షి) విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణచారి పేర్కొన్నారు.శుక్రవారం
యాలాల మండలం కోకట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి 10 జిపిఏ సాధించాలని ఆకాంక్షిస్తూ నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం మండలఅధ్యక్షులు లక్ష్మణ చారి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థు లు కష్టపడి చదువుకుని తమ తల్లిదండ్రులకు గురువులకు మంచిపేరు తేవాలని సూచించారు. సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు లభిస్తాయని పేర్కొన్నారు.రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ ఆదేశానుసారం విద్యార్థుల శ్రేయస్సుకోసం.నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొనడం జరిగింది