విద్యార్థుల ఆరోగ్య రక్షణే ద్యేయం
: ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రాత్ :శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట షామీర్పేట్ లో మంగళవారం రోజున వైద్యురాలు డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి దావఖానా
నుండి వైద్య బృందం విచ్చేసి అవసరమైన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఇశ్రాత్ మాట్లాడుతూ.. మా యొక్క డిగ్రీ కళాశాలలో సైన్స్ గ్రూపులతో పాటు కంప్యూటర్ కోర్సులు కూడా ఎక్కువగా ఉండటం వలన విద్యార్థులు ఎక్కువగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు పిలవగానే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ నుంచి బృందంని పంపించి పిల్లలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శోభారాణి, ఆప్తమెట్రిస్ట్ రాము, విద్యార్థినులు ఎస్ జ్యోతి, శివానిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.
28ఎస్పీటీ -1: విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం