విద్యార్థుల స్కూల్ కిట్టు అందజేత

దండేపల్లి .జనంసాక్షి 25 ఆగస్టు దండేపల్లి మండలం ద్వారక ప్రభుత్వ పాఠశాలల 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ .రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం స్కూల్ కిట్లు ( బ్యాగులు, బుక్స్) అందించడం జరిగింది. అదే విధంగా ఇటివల వచ్చిన వరదల వలన నీట మునిగిన ద్వారక ప్రభుత్వ పాఠశాలకు తీవ్ర నష్టం జరగడంతో ఆ పాఠశాలకు రఘునాథ్ ల్యాప్ టాప్ అందించడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అండగా ఉండటానికి తమ వంతు సహాయంగా ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వ పాటశాల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ ఫౌండేషన్ లక్ష్యం అని అన్నారు. సర్పంచి గీతారాని,ప్రధానోపాధ్యాయురాలు. జయప్రద,ఉపాధ్యాయులు బిజెపి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,నాయకులు గుండం రాజలింగం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.