విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో విద్యావాలంటరిను ఏర్పాటు చేసారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులుచదువుతున్నారు.వీరికి ఒకే ఒక ఉపాద్యాయురాలు పాఠాలు బోధిస్తున్నారు.కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండల్సిందిపోయి ఒక్కరితోనే ఐదవ తరగతి వరకు పాఠాలు బోధిస్తున్నారు.ఈ సమస్యను గ్రామస్తులు బలరాం దృష్టికి తీసుకు వెళ్ళారు.అయితే పాఠశాలను సందర్శించి అక్కడి స్థితిగతులను చూసి అత్యవసరమైన విద్య వాలంటరీని నియమించడం హర్షణీయం.ప్రజలంతా బలరాం చేసే సమాజ సేవ గురించి మాట్లాడు కోవడం అభినందనీయం అని గ్రామ పెద్దలు అన్నారు.